బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏపీ రాష్ట్ర విపత్తు స్పందన , అగ్నిమాపక శాఖ వారోత్సవాల గోడపత్రికను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలే మిన్నగా ప్రమాద విపత్తుల్లో ముందు వరుసలో ఉండి ప్రజలను రక్షించటం అగ్నిమాపక సిబ్బంది కర్తవ్యం అని పేర్కొన్నారు. ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు వారోత్సవాలు విజయవంతం చేయాలని ఆయన కోరారు.