బాపట్ల: మాజీ ఎమ్మెల్యే కోనాకు వైసిపి కార్యకర్తలు ఘన స్వాగతం

75చూసినవారు
విదేశీ పర్యటన ముగించుకొని మంగళవారం బాపట్లకు విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే కోనా రఘుపతి కి నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు భారీ నీరాజనం పలికారు. బాపట్ల రైల్వే స్టేషన్ దగ్గర నుంచి భారీ బైక్ ర్యాలీతో ఆయన ఇంటి వరకు తోడుగా వెళ్లారు. దారి పొడవున జై జగన్, జై కోనా అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బాపట్లలో వైసీపీ పార్టీకి బలం తగ్గలేదు అనే విధంగా ర్యాలీని ఏర్పాటు చేశారని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్