బాపట్ల: కర్లపాలెం విద్యార్థికి గిన్నిస్ రికార్డు

63చూసినవారు
బాపట్ల: కర్లపాలెం విద్యార్థికి గిన్నిస్ రికార్డు
కర్లపాలెం మండలం దుండివారిపాలెంకి చెందిన కట్టుపల్లి విల్సన్ బాబు, ప్రత్యూష దంపతుల కుమారుడు కట్టుపల్లి జోయెల్ విల్సన్ గిన్నిస్ బుక్‌లో బుధవారం తన పేరు లిఖించుకోవడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గత ఆరు నెలలుగా అగస్టీన్ దండంగి నేతృత్వంలో సంగీతం (కీ బోర్డ్)లో శిక్షణ పొందిన జోయెల్, ప్రపంచంలోని 18 దేశాల నుండి 1046 మంది సంగీత కళాకారులతో కలిసి ఒకేసారి మ్యూజిక్ ప్లే చేసి ఈ ఘనతను సాధించాడు.

సంబంధిత పోస్ట్