బాపట్ల: గృహిణులకు అగ్నిప్రమాదాలపై అవగాహన

75చూసినవారు
బాపట్ల:  గృహిణులకు అగ్నిప్రమాదాలపై అవగాహన
బాపట్ల పట్టణంలోని భావన టవర్స్ వద్ద బుధవారం అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గృహిణులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రమాదాల సమయంలో అప్రమత్తంగా ఉంటే ప్రాణాపాయాలను నివారించవచ్చన్నారు. గ్యాస్ లీక్ జరిగితే ఎలా స్పందించాలో ప్రాక్టికల్ డెమో ద్వారా చూపించారు. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే 101 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

సంబంధిత పోస్ట్