బాపట్ల పట్టణంలో శుక్రవారం బాపట్ల అంజుమన్ ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ బిల్లు రద్దు చేయాలని భారీ ర్యాలీ ప్రదర్శన చేశారు. వక్ఫ్ బోర్డులో అన్యమతస్తుల అజమాయిషీని తీసుకొచ్చి ముస్లిం మనోభావాలను దెబ్బతీస్తుందని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో ముస్లిం మైనార్టీల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు.