బాపట్ల మండలం జమ్మలపాలెంలో సోమవారం భర్త పెట్రోల్ పోసి నిప్పంటించడంతో సుభాషిణి అనే మహిళ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఆమెను బాపట్ల నుండి గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఈ ఘటనపై ఆగ్రహించిన సుభాషిణి బంధువులు మంగళవారం ఉదయం జమ్మలపాలెం సెంటర్లో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.