బాపట్ల: ఖాజీపాలెం లో పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం

51చూసినవారు
బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలంలోని ఖాజీపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని నాయి బ్రాహ్మణ కాలనీలో ఆదివారం సాయంత్రం మెరుపులతో కూడిన అకాల వర్షం పడటంతో కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో కొబ్బరి చెట్టు పూర్తిగా ధ్వంసం అయింది. పిడుగుపాటుకు ఎవరికి ఎటువంటి హాని కలగలేదు. ఆదివారం బాపట్ల పట్టణం భీమవారిపాలెంలో కూడా పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధమవడం గమనార్హం. ఈ రెండు ఘటనల్లో ప్రాణహాని జరగలేదు.

సంబంధిత పోస్ట్