బాపట్ల: రైలు నుంచి జారిపడిన వ్యక్తి

66చూసినవారు
బాపట్ల: రైలు నుంచి జారిపడిన వ్యక్తి
రైలు నుంచి జారిపడి బిహార్ కు చెందిన వ్యక్తికి గాయాలైన ఘటన బాపట్లలో శుక్రవారం చోటు చేసుకుంది. రైల్వే అధికారుల వివరాల ప్రకారం బాపట్లలోని పెదనందిపాడు ఫ్లై ఓవర్ చాకలి పాలెం గేటు మధ్యలో రైలులో నుంచి బిహార్ వాసి జారిపడ్డాడు.  ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. మొదట బాపట్ల వైద్యశాలకు తరలించి చికిత్స అందించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు వైద్యులు రిఫర్ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్