బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ గురువారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ను కలిశారు. తుఫాను ప్రభావంతో నియోజకవర్గంలో వేలాది ఎకరాలు ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారని సీఎంకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు బాపట్ల తెదేపా కార్యాలయం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు.