కార్తీక మాసం సందర్భంగా బాపట్ల మండలం నందిరాజుతోట గ్రామంలోని శివాలయంలో గురువారం బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ, మండల అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కందుల బాలకోటేశ్వరరావు పాల్గొన్నారు.