బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం కొత్తపాలెంకు చెందిన గుడుబోయిన శివకోటిరెడ్డి పూరీల్లు గురువారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం లో కాలిపోయింది. సమాచారo తెలుసుకున్న బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ బాధితుడు ఇంటి వద్దకు వెళ్లి పరామర్శి ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం సహాయం అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అఫ్జల్ , తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.