బాపట్ల పట్టణానికి చెందిన ఓ మహిళ వ్యక్తిగత కారణాలతో చనిపోవాలనే ఉద్దేశంతో శనివారం సూర్యలంక సముద్రపు తీరం నందు ఆత్మహత్యకు యత్నించినది. గమనించిన మెరైన్ సూర్యలంక పోలీసు సిబ్బంది వెంటనే స్పందించి అప్రమత్తంగా వ్యవహరించి ఆమె ప్రాణాలను కాపాడారు. ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి బంధువులను పిలిపించి వారికి అప్పగించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి సూర్యలంక పోలీసులను అభినందించారు.