బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల సమస్యలు విని వారు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు. తమ అర్జీలను పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.