బాపట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాంబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు బాపట్ల సీఐగా బదిలీపై వచ్చినట్లు రాంబాబు కార్యాలయంలో మీడియాకు తెలిపారు. పట్టణ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేస్తారని పేర్కొన్నారు. సిఐ రాంబాబును పలువురు సిబ్బంది ఆహ్వానించారు.