బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో గురువారం గుంటూరు రీజియన్ అధికారి యస్. హరికృష్ణ, కమిషనర్ జి. రఘునాథ రెడ్డితో కలిసి ఛాంబర్ లో ఆస్థి , ఖాళీ స్థలం, నీటి కుళాయి పన్నులు వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున పన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇప్పటివరకు వసూళ్లు చేసిన పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూరు శాతం పన్ను వసూళ్లు చేయాలని ఆర్డీ సూచించారు.