సంక్రాంతి పండుగ నిమిత్తం ఊరికి వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని శుక్రవారం బాపట్ల డిఎస్పీ రామాంజనేయులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై ఫ్యామిలీతో వెళ్ళరాదని, వాహనము నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఓవర్టేక్ చేయరాదని, అతి వేగంగా వెళ్ళరాదని ప్రధానంగా మంచు సమయంలో ప్రయాణించరాదని పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.