బాపట్ల: బీచ్ వద్ద భద్రతా చర్యలను పరిశీలించిన ఎస్పీ

80చూసినవారు
బాపట్ల: బీచ్ వద్ద భద్రతా చర్యలను పరిశీలించిన ఎస్పీ
వేసవి సెలవుల్లో యాత్రికుల రద్దీ నేపథ్యంలో సూర్యలంక బీచ్ వద్ద భద్రతా చర్యలను బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ బుధవారం స్వయంగా తనిఖీ చేశారు. సముద్రతీరంలో డ్రోన్ల ద్వారా నిఘా పెట్టడంతో పాటు, నిర్దిష్ట లోతులను సూచించే జెండాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్