సంక్రాతి పండుగ పురస్కరించుకొని కోడిపందేలు, పేకాట, మట్కా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల డిఎస్పి రామాంజనేయులు పేర్కొన్నారు. శనివారం బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో సిబ్బందితో కలిసి విలేకరులతో మాట్లాడారు. సంక్రాంతి సెలవుల దృష్ట్యా దొంగతనాలు, కోడి పందాలు పేకాట, ఇతర జూదాలను కట్టడి చేసేందుకు జిల్లా ప్రజలకు పలు సూచనలు చేసారు. కొన్ని ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.