బాపట్ల: శక్తి యాప్ పై విద్యార్థులు, మహిళలు అవగాహన కలిగి ఉండాలి

74చూసినవారు
బాపట్ల: శక్తి యాప్ పై విద్యార్థులు, మహిళలు అవగాహన కలిగి ఉండాలి
బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు నిజాంపట్నం మండలం ఆముదాలపల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మహిళల రక్షణకు సంబంధించి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన శక్తి యాప్ యొక్క ప్రాముఖ్యతపై నిజాంపట్నం ఎస్సై తిరుపతిరావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత, రక్షణ కోసం శక్తి యాప్ శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుందని, శక్తి యాప్ ప్రతి స్త్రీకి కవచం వంటిదని ఆయన అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్