బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ జె. వెంకట మురళి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ , రెవిన్యూ డివిజనల్, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజలు అర్జీలను ఇవ్వవచ్చునని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుందని ఆయన తెలియ జేశారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.