బాపట్ల పట్టడం లోని కొత్త బస్టాండ్ సెంటర్లో సోమవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి ఇరువురిని అంబులెన్స్ వాహనంలో బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. బాపట్ల పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.