బాపట్ల జిల్లా అగ్నిమాపక శాఖ నూతన అధికారిగా వినయ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ పదవిలో విధులు నిర్వహించిన మాధవ నాయుడు శ్రీ సత్యసాయి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో అగ్నిప్రమాదాలు, విపత్తుల నియంత్రణకు పూర్తి స్థాయిలో పనిచేస్తామని వివరించారు.