బాపట్ల: సైనికుల సమస్యల పరిష్కారానికి సంక్షేమ సంఘం కృషి

55చూసినవారు
బాపట్ల: సైనికుల సమస్యల పరిష్కారానికి సంక్షేమ సంఘం కృషి
రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం సైనికులు, మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికే ఏర్పాటైందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు అన్నారు. బాపట్ల విజయలక్ష్మి పురంలోని సంఘ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌లో ఆయన పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సైనికుల కుటుంబ సభ్యులు, మాజీ సైనికుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్