వివాహం చేసి ఓ ఇంటి వాడిని చేయాలనుకున్న తల్లిదండ్రుల ఆశలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. శుక్రవారం రాత్రి తెనాలి వెళ్లిన నర్రా మణికంఠ కృష్ణకుమార్ (24) తిరిగి వస్తూ బావాజీపాలెం వద్ద మలుపులో బైకు అదుపు తప్పి కిందపడిపోయాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి సమయాన ఈ విషాదం జరగడం గ్రామంలో విషాదం మిగిల్చింది.