కేంద్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రకార్ జైన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో కేంద్ర బృందం సభ్యులు శ్రీరామ్, లోహిత్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. జాతీయ గ్రామీణ జీవనోపాదుల కొరకు కేంద్ర ప్రభుత్వం 12 పథకాలను అమలు చేస్తుందన్నారు. నిరుపేదలకు జీవన ఉపాధి కల్పించి, వారి స్థితిగతులను మార్చేందుకు ఈనెల 26న జిల్లాలో పర్యటిస్తామని కేంద్ర బృందం తెలిపారు.