విశాఖలో జరిగే యోగాంధ్ర సభ చరిత్రలో నిలిచిపోవాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే పుల్లారావు ఆదివారం పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మోదీకి ఉన్న నమ్మకమే యోగా దినోత్సవ బాధ్యత అప్పగించేందుకు కారణమన్నారు. యోగా ఆరోగ్యానికి మేలు చేస్తుందని, రాజకీయాలను దాటి అందరూ యోగాను ఆచరించాలని సూచించారు. కార్యక్రమం గిన్నిస్ రికార్డులకు వెళ్ళాలని ఆకాంక్షించారు.