ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వ తేది వరకు సముద్ర జలాలో చేపల వేట నిషిద్ధమని బాపట్ల జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాస్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమయంలో జలచరాల సంతానోత్పత్తి జరుగుతున్న దృష్ట్యా వేటను నిషేధించినట్లు ఆయన తెలిపారు. కావున మత్స్యకారులు యాంత్రిక లేదా మర పడవల్లో చేపలు వేటకు వెళ్ళరాదన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి చేపల వేటకు వెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు