బాపట్లలో వేంచేసియున్న శ్రీ శ్రీ భావన్నారాయణ స్వామి వారి దేవస్థానములో శనివారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ "సమిష్ఠి భగవద్గీత పారాయణం"కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ చిన్మయ మిషన్ కమిటీ మరియు ధృతి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సంస్థ సహాయ సహకారాలతో "చిన్మయా మిషన్" అనే అధ్యాత్మిక సంస్థను ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భముగా నిర్వహించారు.