పదవ తరగతి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఒత్తిడికి గురికావద్దని పూర్వవిద్యార్థి, ఉత్తర అమెరికా తెలుగు సంఘం నేషనల్ కోఆర్డినేటర్ ఎన్నారై రామకృష్ణ బాలినేని అన్నారు. పెదకూరపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన చైతన్య సమితి ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న 64 మంది విద్యార్థులకు గురువారం ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్, స్కేల్, పౌచ్ తదితర వస్తువులను పంపిణీ చేశారు.