బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన జిల్లా విద్యుత్ కమిటీని నియమిస్తూ జిల్లా కలెక్టర్ వెంకట మురళి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి సెక్రటరీగా కలెక్టర్ వ్యవహరిస్తుండగా ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్లు, బాపట్ల జిల్లాలోని ఆరుగురు ఎమ్మెల్యేలు సభ్యులుగా నియమితులయ్యారు. అలాగే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు కూడా కమిటీలో స్థానం లభించింది.