డబ్బులు ఎవరికి ఊరికే రావు నీ కష్టార్జితం సైబర్ నేరగాళ్ల పాలు చేయవద్దు అని బాపట్ల ఎస్పీ తుషార్ డూడి సూచించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో సైబర్ క్రైమ్ పై మీడియా సమావేశంలో మాట్లాడారు. అపరచిత వెబ్ సైట్స్ ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయొద్దని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పైవివిధ అంశాలను వివరించారు. సైబర్ నేరం బారిన పడిన వెంటనే1930 కాల్ చేయాలని సూచించారు. పోగొట్టుకున్న సొమ్ము తిరిగి పొందే అవకాశం ఉందన్నారు.