బాపట్లలో తాగునీటి పైప్ లైన్ లీకేజ్

51చూసినవారు
బాపట్ల పట్టణంలోని మెయిన్ రోడ్ అయినా జిబిసి రోడ్ లో కన్యకా పరమేశ్వరి ఆలయం ఎదురుగా శుక్రవారం తాగునీరు సరఫరా చేసే పైప్ లైన్ లీకైయింది. ఈ నేపథ్యంలో వృధాగా పోతున్న మంచినీటితో రోడ్డంతా బురదమయం అవుతుందని స్థానికులు తెలిపారు. దీంతో ఆ మార్గంలో వెళ్లే పాదాచారాలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్