అంతరాయం లేకుండా లోతట్టు ప్రాంతాలకు త్రాగునీరు సరఫరా చేయాలి..

68చూసినవారు
అంతరాయం లేకుండా లోతట్టు ప్రాంతాలకు త్రాగునీరు సరఫరా చేయాలి..
బాపట్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలకు నీటి సరఫరా చేసే ట్రాక్టర్లను మునిసిపల్ కమీషనర్ జి. రఘునాథ రెడ్డి గురువారం పరిశీలించారు. ప్రస్తుతం ఉపయోగoలో ఉండి ఉపయోగంలో లేని ట్రాక్టర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపయోగం లో లేని ట్రాక్టర్లకు మరమ్మత్తులు చేయించి వెంటనే వాడుకలోకి తీసుకురావాలని ఇంజనీర్ అధికారులను ఆదేశించారు. అనంతరం ట్యాంకర్ల నీటి సరఫరా ట్రిప్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్