కర్లపాలెం మండలంలోని నల్లమోతు వారిపాలెంలో ఉపాధిహామీ పథకం పనులను మంగళవారం ఎంపీడీఓ అద్దురి శ్రీనివాసరావు ప్రారంభించారు. జాబ్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు లభించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు, గ్రామ పెద్దలు మాడా శ్రీనివాసరావు, గరిగంటి శీను, మునిపల్లి చిన్న, ఏపీవో శ్యామ్, ఫీల్డ్ అసిస్టెంట్ బేబీ షాలిని, బీసాబత్తుని ఆంజనేయులు పాల్గొన్నారు.