బాపట్ల: నలుగురు బైక్ దొంగలు అరెస్ట్

56చూసినవారు
బాపట్ల: నలుగురు బైక్ దొంగలు అరెస్ట్
బాపట్ల పోలీసులు శనివారం నలుగురు బైక్ దొంగలు అరెస్టు చేయడంతో పాటు 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ.. ముద్దాయిలు బాపట్ల, చీరాల, తెనాలి ప్రాంతాలలో చోరీలు చేశారన్నారు. వారిని అదుపులోకి తీసుకొని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. త్వరలో వీరిని కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. పట్టణ సిఐ రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్