రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని పాత పద్ధతి విధానాన్ని మళ్లీ ప్రభుత్వం ప్రారంభించిందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో రేషన్ డీలర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఇంటింటికి రేషన్ వాహనాలు ఏర్పాటు చేయటం ప్రజాధనం వృధా అవ్వటమే నన్నారు. ప్రభుత్వం అన్ని విధాల రేషన్ డీలర్లను ఆదుకుంటుందన్నారు.