ఐఐటీ మద్రాసు నిపుణులు అమరావతి ఈ నెల 12న రానున్నారు. ఒక్కరోజు పర్యటనలో ఐకానిక్ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదుల బలాన్ని పరిశీలించనున్నారు. 2019లో నిర్మాణం ఆగిపోయిన తర్వాత పునాదుల్లో నీరు నిలిచింది. గత ఏడాది నిపుణుల బృందం వాటిని పడవల్లో పరిశీలించి, నమూనాలు పరీక్షించి పటిష్టంగా ఉన్నాయని నివేదించారు.