నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమం బుధవారం బాపట్లలో జరిగింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, నక్కా ఆనందబాబు, ఏలూరి సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్. అధికారులు పాల్గొన్నారు.