కర్లపాలెంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

68చూసినవారు
కర్లపాలెంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కర్లపాలెం మండలంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని కర్లపాలెంలో జనసేన జెండాను నాయకులు ఆవిష్కరించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా పిఠాపురం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల అధ్యక్షుడు గొట్టిపాటి శ్రీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్