కారంచేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఎంపీపీ నీరు కట్టు వాసుబాబు నిర్వహించారు. సమావేశంలో మొదట పొగాకు రైతుల సమస్యలపై చర్చ జరిగింది. అధికార పార్టీకి చెందినవారే పొగాకును కొనుగోలు చేస్తున్నారని ఎంపీపీ విమర్శించారు. సీరియల్ నంబర్ ప్రకారం కొనుగోలు చేయాలని కో ఆప్షన్ సభ్యులు సూచించారు.