కొల్లూరు: అంబులెన్స్ సేవలు తనిఖీ

71చూసినవారు
కొల్లూరు: అంబులెన్స్ సేవలు తనిఖీ
108 అంబులెన్స్ సేవల బాపట్ల జిల్లా మేనేజర్ బాలకృష్ణ గురువారం 108లను తనిఖీ చేసి పరికరాల పనితీరును పరిశీలించారు. కొల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన మాట్లాడుతూ క్షతగాత్రులు ఫోన్ చేసిన 20 నిముషాలలోపే ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలను తప్పనిసరిగా అంబులెన్స్‌లోనే తీసుకువెళ్లాలని ఆశా వర్కర్లకు సూచించారు. అలాగే క్షతగాత్రుల పట్ల సిబ్బంది మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు.

సంబంధిత పోస్ట్