కర్లపాలెం మండలంలోని మోటుపాలెం వద్ద మంగళవారం యాజలి నుంచి కాజీపాలెం వైపు వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు.