సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ 64వ డివిజన్ కండ్రికలో బుధవారం బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పర్యటించారు. అధికారులతో వరద ముంపు కాలనీల్లో పరిస్థితి పరిశీలించారు. సమీప పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని ప్రజలను కోరారు. కాలనీలలో ఇళ్ళ వద్దకు వెళ్లి స్వయంగా ఆహార పొట్లాలు, పాలు, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసి వరద బాధితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.