నియోజకవర్గo పరిధిలోని పేదలకు మన వంతు సహాయ సహకారాలు అందించడం ఆనందంగా ఉందని బాపట్ల నియోజకవర్గం నవతరం పార్టీ ఇంచార్జి షేక్ కరీం అన్నారు. శనివారం పట్టణంలోని 6వ వార్డు జమేదార్ పేటలో ప్రజలకు బియ్యం పంపిణీ చేశారు. పేదలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు మరి కొంత మంది ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో పార్టీ సభ్యులు షేక్ నాగూర్ వలి, నరేంద్ర, గోపాల్, ఖతాబా పాల్గొన్నారు.