ఒంగోలు సీనియర్ జడ్జి, డిస్ట్రిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఇబ్రహీం షరీఫ్ ఆదివారం కడవకుదురు సచివాలయాన్ని సందర్శించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కడవకుదురులోని దాయాదుల ఆస్తి వివాదంపై గొల్లమూరి వెంకట రమణా రెడ్డి, కోమట్ల రామాంజనేయరెడ్డి మధ్య న్యాయమూర్తి ఇరుపక్షాలను విచారించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ప్రభాకరరావు, ఎస్సై రమేష్ తదితరులు పాల్గొన్నారు.