బాపట్ల జిల్లా గనుల శాఖ సహాయ సంచాలకులుగా రామచంద్రయ్య శనివారం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. జిల్లాకు మంచి పేరు తెచ్చే విధంగా శాఖల సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకట మురళి రామచంద్రయ్యకు సూచించారు. జిల్లా గనుల శాఖ సిబ్బంది రామచంద్రయ్యను అభినందించారు.