కాకుమాను నుంచి పుసులూరు వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న ఓ శ్రీ రైస్ మిల్లులో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు రైస్ మిల్లులోని డీవీఆర్ (డిజిటల్ వీడియో రికార్డర్) ను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. కాగా ఈ మధ్య కాలంలో కాకుమాను మండలంలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చోరీకి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.