బాపట్ల: రోడ్డుపై కారుని అలాగే ఉంచి సిమెంట్ రోడ్డు వేశారు

52చూసినవారు
బాపట్లలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు పార్క్ చేసిన కారుని అలాగే ఉంచేసి బుధవారం కాంక్రీట్ రోడ్డు వేశారు. బాపట్ల జిల్లా దేశాయిపట్నంలో సిమెంట్ రోడ్డు వేస్తున్న సందర్భంలో రోడ్డు పక్కనే ఉన్న కారు తీయాలని ఎన్నిసార్లు చెప్పినా తీయకుండా కారు తాళం వేసి వెళ్ళిపోవటంతో కాంట్రాక్టర్ రోడ్డు వేశాడని అధికారులు చెప్పారు. కారు తీయడానికి తాళం లేకపోవడంతో కారుని అలాగే ఉంచి సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్