బాపట్లలోని సూర్యలంక బీచ్‌లో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్రం గుంటూరు సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్ వద్ద ఉన్న వ్యర్థాలను తొలగించారు. అలాగే చీపిరి పట్టు.. చేతని నెట్టు అని నినాదాలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా బాపట్ల జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.