యాజలిలో కూటమి ఫ్లెక్సీ చించివేత గ్రామoలో ఉద్రిక్తత

77చూసినవారు
యాజలిలో కూటమి ఫ్లెక్సీ చించివేత గ్రామoలో ఉద్రిక్తత
బాపట్ల మండలం యాజలి గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూటమి శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీనీ చించి వేశారు. గ్రామ ప్రధాన రహదారి ప్రక్కన ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని చించి వేయడంపై కూటమి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కొందరు వ్యక్తులు పార్టీల మధ్య చిచ్చుపెట్టే క్రమంలో ఫ్లెక్సీలు చించారని గ్రామ తెదేపా నాయకుడు వెంకట్రావు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్